![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. `గీత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ తరువాత పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబుకి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి హైదరాబాద్ కి చేరుకుంది యూనిట్.
ఇదిలా ఉంటే.. ఫైనాన్షియల్ స్కామ్స్ చుట్టూ అల్లుకున్న కథతో `సర్కారు వారి పాట` తెరకెక్కుతోందని.. ఇందులో మహేశ్ బాబు ఫైనాన్షియర్ రోల్ లో కనిపిస్తారని టాక్. అంతేకాదు.. ఇందులో తన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`సర్కారు వారి పాట`ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2022 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది.
`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత మహేశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. `సర్కారు వారి పాట`పై భారీ అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |