Home  »  News  »  రవితేజ 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ.. అనుకున్నదే జరిగింది.!

Updated : Aug 21, 2026

మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఇరుముడి'. ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. "రవితేజ ఈజ్ బ్యాక్" అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సినిమా మొదలవ్వడమే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ చుట్టూ నేచురల్‌గా నడుస్తుంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇందులో రవితేజ ఒక సిన్సియర్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపారు. తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్స్ థియేటర్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. ఆయన కూతురిగా నటించిన బేబీ నక్షత్ర యాక్టింగ్ అయితే ఈ సినిమాకే మెయిన్ హైలైట్ అని నెటిజన్లు పొగిడేస్తున్నారు.

ఇక ఫస్ట్ హాఫ్ స్లో అండ్ స్టెడీగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లోకి ఎంటర్ అవ్వగానే కథ మలుపు తిరుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఆ కీలకమైన ట్విస్ట్ థియేటర్లలో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' సీక్వెన్స్ థియేటర్లను షేక్ చేస్తోందట. మాస్ ఆడియన్స్ కేరింతలు కొట్టేలా ఆ ఫైట్ బ్లాక్‌ను డిజైన్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లిందట.

డైలాగ్ కింగ్ సాయికుమార్ పవర్‌ఫుల్ డైలాగ్స్, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్ పాత్రలు కథకు మరింత బలాన్నిచ్చాయి. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్యను ఎంచుకుని, దానికి ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి శివ నిర్వాణ ఈ చిత్రాన్ని మలిచిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ట్విట్టర్‌లో రివ్యూవర్స్ మాటల్లో చెప్పాలంటే.. "ఇరుముడి ఒక పవర్‌ఫుల్ అండ్ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ థ్రిల్లర్". కొన్ని చోట్ల  రైటింగ్ కాస్త స్లో అయినప్పటికీ, క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం ఆ లోపాలను పూర్తిగా మరిపించేలా ఉన్నాయి. చాలా మంది ట్విట్టర్ రివ్యూవర్లు ఇది రవితేజకి కచ్చితంగా ఒక గ్రాండ్ కమ్‌బ్యాక్ మూవీ అని తేల్చిచెబుతున్నారు. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూలు చేసే సత్తా ఉన్న సినిమా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

'ఇరుముడి' సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి షోకే ఆ అంచనాలు నిజమవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Irumudi Review, Ravi Teja, Shiva Nirvana

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.