Home  »  News  »  Ameer Log Movie Review In Telugu: అమీర్ లోగ్ మూవీ రివ్యూ

Updated : Aug 20, 2026

 

 

-సినిమా పేరు: అమీర్ లోగ్
-న‌టీన‌టులు: వేద జలంధర్, హరి మున్నంగి, మనోజ్ ఆవుల, శశిధర్ కొచ్చర్ల కోట, రావణ్ నిట్టూరు, -విశ్వేందర్ రెడ్డి, పవన్ రమేష్ తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: సాలిగంటి విజయ్ కుమార్ 
-ఎడిటింగ్: రోహిత్ పెనుమత్స 
-మ్యూజిక్: స్మరన్ సాయి 
-నిర్మాత‌: మాధవి రెడ్డి సోమ
-బ్యానర్ : అవాళ్ నెంబర్ ప్రొడక్షన్స్ 
-రచన,దర్శకత్వం: రమణా రెడ్డి సోమ 
-రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026 

హైదరాబాద్ పోరగాళ్ల కథ అంటు 'అమీర్ లోగ్' థియేటర్స్ లోకి వచ్చేసింది. రిలీజ్ డేట్ ఇరవై ఒకటి అయినా, ప్రమోషన్స్ తో వచ్చిన క్రేజ్ తో ప్రీమియర్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

శ్రీను( హరి మున్నంగి), రఫీక్(మనోజ్ ఆవుల), మల్లేష్( శశిధర్ కొచ్చర్ల కోట) చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక బస్తీ వాళ్ళ అడ్డా. ముగ్గురు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కావడంతో పాటు పని పాట లేకుండా తిరుగుతుంటారు. కానీ అమాయకత్వం, మంచితనం ఆ ముగ్గురి సొంతం. సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే గీత(వేద జలంధర్) ఆ ముగ్గురికి ఆత్మీయురాలు లాంటిది. తమ బస్తీలోనే ఉండే గీతని అక్క అని పిలుస్తుండటంతో పాటు తమ కష్ట సుఖాలని పంచుకుంటూ ఉంటారు. గీత తన ఆఫీస్ లోనే పని చేసే టీం లీడర్ రవి(రావణ్ నిట్టూరు) ని ప్రేమిస్తూ ఉంటుంది. రవి వల్ల శ్రీను, రఫీక్, మల్లేష్ కి అన్యాయం జరుగుతుంది. దీంతో రవికి గీత బ్రేక్ అప్ చెప్తుంది. జులాయిగా తిరిగే శ్రీను, రఫీక్, మల్లేష్ కి రవి అన్యాయం చేయడం ఏంటి? అసలు ఆ ముగ్గురి స్నేహితుల కథ మొత్తం ఏంటి? వాళ్ళ జీవితంలో ఎవరెవరు ఉన్నారన్నదే అమీర్ లోగ్. 


ఎనాలసిస్ 
 కథలో గొప్పతనం లేకపోయినా ఎక్కడ ఎలాంటి హడావిడి లేకుండా మంచి కథనంతో మూవీ చివరి వరకు బోర్ కొట్టకుండా సాగింది. క్యారక్టర్ ల యొక్క మాటలు, బాడీ లాంగ్వేజ్ మనకి తెలిసిన వాళ్ళు స్క్రీన్ పై ఉన్నారా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే శ్రీను, రఫీక్, మల్లేష్ ల ఇంట్రడక్షన్ సీన్స్ బాగున్నాయి. దీంతో మనకి తెలియకుండానే అమీర్ లోగ్ లో లీనమవుతాం. చాచా( విశ్వేందర్ రెడ్డి) వచ్చిన సీన్స్ బాగుండటంతో పాటు గల్లీ బస్తీలలో ఉన్న పోరగాళ్ళు ఎలా ఉంటారో అలాగే వచ్చిన సీన్స్ హైలెట్. క్రికెట్ గేమ్  సీన్స్ కూడా బాగా వచ్చాయి.

ముఖ్యంగా శ్రీను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత రఫీక్, మల్లేష్ లు బోర్ కొడుతుందని శ్రీనుకి ఫోన్ చేస్తే మీరు కూడా ఉద్యోగం చుసుకోండిరా అనే సన్నివేశం, డైలాగ్స్ బాగున్నాయి. కాకపోతే ఈ ఎపిసోడ్ ని ఇంకాస్త రన్ టైం పెంచి బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఇంటర్వెల్ సీన్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఆ ముగ్గురి జీవితం గీత వల్ల మరో వైపు టర్న్ అవ్వడం, ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ బాగున్నాయి. కాకపోతే ఫ్రాంచైజ్ ని గీత లవర్ రవి వేరే వాళ్ళకి అమ్మేయాలని నిర్ణయించుకున్నప్పుడు శ్రీను ,రఫీక్, మల్లేష్ లు రవికి ఎదురు తిరగడం చూపించాల్సింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి.

నటీనటులు సాంకేతిక నిపుణల పనితీరు
హరి మున్నంగి, మనోజ్ ఆవుల, శశిధర్ కొచ్చర్ల కోట ముగ్గురు కొత్తవాళ్ళైనా సరే తమ క్యారక్టర్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేసారు. డెబ్యూ అయినా సరే  ఎంతో  అనుభవమున్న వారిలా నటించారని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గీత క్యారక్టర్ లో  వేద జలంధర్ నటనలో మెరుపులు లేకపోయినా ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసింది. మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, పవన్ రమేష్ కూడా క్యారక్టర్ పరిధి మేరకు నటించి మెప్పించారు. రమణా రెడ్డి సోమ  దర్శకుడిగా, రైటర్ గా  కొంత మేర సక్సెస్ అయ్యాడు. కాకపోతే డైలాగ్స్ , ఎంటర్ టైన్ మెంట్  విషయంలో ఇంకొంచం కేర్ తీసుకోవాల్సింది. ఫొటోగ్రఫీ విషయంలో కూడా అంతే.  ఎడిటింగ్  ప్లస్ పాయింట్. ఇలాంటి చిత్రాలకి నిర్మాణ విలువలు కనపడవు. సాంగ్స్  కొత్తగా, ఫ్రెష్ గా ఒక రేంజ్ లో ఉన్నాయి.

బలాలు 
1 .నటీనటుల పెర్ ఫార్మెన్స్ 
2 . కథనం
3 . సాంగ్స్ 
4 . డైరెక్షన్ 

బలహీనతలు
 1 .ఎంటర్ టైన్ మెంట్ కి అవకాశం ఉండి కూడా బాగా ఎస్టాబ్లిష్ చెయ్యకపోవడం 


చివరిగా చెప్పాలంటే మనసులో ఎలాంటి కల్మషం లేని పక్కా హైదరాబాదీ బస్తీ పోరగాళ్ళు బోర్ కొట్టించకుండా ఉండటంలో ఒక మాదిరిగానే సక్సెస్ అయ్యారు  

రేటింగ్ 2 .75 /5                                                                                   అరుణాచలం 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.