![]() |
![]() |

అల్లు అర్జున్ టైటిల్ పాత్రధారిగా సుకుమార్ రూపొందిస్తోన్న చిత్రం 'పుష్ప'. వారి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో సినిమా ఇది. ఇదివరకు 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల్ని వారు కలిసి చేశారు. తొలిసారి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్న బన్నీ మూవీగా మంచి బజ్ తెచ్చుకుంది 'పుష్ప'. కాగా ఈ సినిమాలో విలన్ పాత్రధారి ఎవరనే విషయంపై సస్పెన్స్ వీడింది. పుష్పరాజ్‌ను ఢీకొట్టే విలన్‌గా మలయాళీ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నటించనున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా "Welcoming #FahadhFaasil on board for the biggest face-off #VillainOfPushpa #Pushpa " అంటూ ట్వీట్ చేసింది.
ఫహద్ ఫాజిల్‌కు మలయాళంలో హీరోగా మంచి ఇమేజే ఉంది. అయితే తను స్వయంగా నిర్మించిన 'కుంబళంగి నైట్స్'లో నెగటివ్ రోల్ చేసి అలరించారు. ఆ క్యారెక్టర్ పోషణకు గాను బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నాడు కూడా. అంతకు ముందు 2017లో 'తొండిముత్తలుమ్ దృక్సక్షియుమ్' సినిమాలో ప్రదర్శించిన అభినయానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ గెలుచుకున్నాడు. అలాగే 'సూపర్ డీలక్స్' మూవీలో సమంత భర్తగా నటించి మెప్పించాడు. ఇటీవల 'ట్రాన్స్', 'సీ యూ సూన్' సినిమాలు నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. విజయ్ సేతుపతి లాంటి నటుడు మిస్సవడంతో కొంత అసంతృప్తిగా మేకర్స్, ఫహద్ ఫాజిల్ రాకతో కుదుటపడ్డారనే చెప్పాలి.
తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న 'పుష్ప' విడుదల కానున్నది.
![]() |
![]() |