![]() |
![]() |

సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన సినిమా మజాకా. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మన్మథుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మజాకా.. వరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత రాజేష్ దండా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మజాకా సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. (Mazaka)
త్రినాధరావు నక్కినతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అని, ఆయనతో మరో సినిమా చేయాలని ఉందని రాజేష్ దందా అన్నారు. మజాకా సినిమాకి సీక్వెల్ చేయాలని ఆలోచన ఉందని, సినిమా ఎండ్ లో డబుల్ మజాకా అనే టైటిల్ కూడా వేశామని తెలిపారు. ఈమధ్య సీక్వెల్ ట్రెండ్ ఎక్కువైంది. ఫిబ్రవరి 26న విడుదల కానున్న మజాకా హిట్ అయితే.. ఈ సినిమాకి సీక్వెల్ రావడం ఖాయమని నిర్మాత మాటలను బట్టి అర్థమవుతోంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ నిర్మించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సామజవరగమన సీక్వెల్ పై కూడా రాజేష్ దండా స్పందించారు. ప్రస్తుతం మా రైటర్ భాను, రవితేజ గారితో సినిమా చేస్తున్నారని.. అది కంప్లీట్ అయ్యాక కథ రెడీ చేస్తామని తెలిపారు.
![]() |
![]() |