![]() |
![]() |

పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఫిలిమ్స్ మీద నుంచి తన ఫోకస్‌ను పాలిటిక్స్ పైకి మళ్లించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆయన 'గుడ్ మార్నింగ్ సీఎం సార్' అనే నినాదాన్ని నడుపుతున్నారు. ఇదే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో విపరీతంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఏపీలోని రోడ్ల దుస్థితి ఏ తీరున ఉందో ఈ ప్రచారంతో తెలియజేస్తున్నారు.
అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని పవన్ కల్యాణ్ ఇప్పటికే సంక్పలించారు. రాజకీయంగా బిజీ అవుతుండటంతో, సినిమాలకు కొద్ది కాలం విరామం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఫలితంగా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నడుస్తున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. అంతే కాదు, సముద్రకని దర్శకత్వంలో రీమేక్ అవుతున్న తమిళ చిత్రం 'వినోదాయ సీతమ్' రెగ్యులర్ షూటింగ్ కూడా వాయిదా పడింది.
ఈ రెండు సినిమాల షూటింగ్‌కు సంబంధించి కొత్త డేట్స్ ఎప్పుడు ఇచ్చేదీ పవన్ కల్యాణ్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇవి కాకుండా మిగతా మూవీ కమిట్‌మెంట్స్‌ను ఆయన దాదాపుగా పక్కన పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్న ఆయన, రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు.
![]() |
![]() |