![]() |
![]() |

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ బాగా ఆలస్యమవుతూ వస్తోంది. అసలు ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు విడుదలవుతుంది? అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ఒకటి వినిపిస్తోంది.
'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ పాత్రకి సంబంధించిన షూట్ మొత్తం ఈరోజుతో పూర్తయిందట. మిగతా పాత్రల షూటింగ్ కూడా ఇంకా పదిరోజులు మాత్రమే పెండింగ్ ఉందట. అది కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పరుగులు పెట్టించాలని చూస్తున్నారట.
జూలై 12న 'ఇండియన్-2' విడుదలవుతోంది. ఆ తర్వాత దర్శకుడు శంకర్ తన ఫుల్ ఫోకస్ 'గేమ్ ఛేంజర్' పైనే పెట్టనున్నారు. పెండింగ్ షూట్ ని వెంటనే పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి తగిన సమయం కేటాయించనున్నారట. ఈ మూవీ డిసెంబర్ లేదా జనవరిలో విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఇక 'గేమ్ ఛేంజర్' షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్.. ఇప్పటినుంచి తన పూర్తి దృష్టి బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న నెక్స్ట్ మూవీపై పెట్టనున్నాడట. ఆ సినిమాలోని పాత్ర కోసం రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్ కి వెళ్లనున్నాడని.. మేకోవర్ చాలా కొత్తగా ఉండనుందని వినికిడి.
![]() |
![]() |