![]() |
![]() |

డిస్ట్రిబ్యూటర్‌గా, కో ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి చిన్న సినిమాలతో పెద్ద విజయాల్ని అందుకున్నారు. తన సినిమాలతో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసి అలాంటి పలు సినిమాలు వచ్చేందుకు దోహదపడ్డారు. దర్శకునిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా కూడా మారుతి రాణించారు. యూత్‌కి నచ్చే కథాంశాలతో సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. రొమాన్స్, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్, లవర్స్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ రోజుల్లో సినిమాకి ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డును అందుకున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు మారుతి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సాహో, సలార్, కల్కి వంటి సినిమాలతో పక్కా మాస్ హీరోగా మారిన ప్రభాస్‌ను మన పాత డార్లింగ్‌లా చూపిస్తానంటున్నారు మారుతి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలకు పోకుండా సౌమ్యుడు అని పేరు తెచ్చుకున్న మారుతికి, ఒక హీరోయిన్‌కి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అది చిలికి చిలికి గాలివానగా మారింది. దాదాపు 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మారుతి. ఆ వివాదానికి తెర తీసిన హీరోయిన్ నయనతార. వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘బాబు బంగారం’ చిత్రం షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆ వివాదం గురించి మారుతి తెలియజేస్తూ ‘నయనతార ఏ విషయంలోనూ యూనిట్‌కి సహకరించేది కాదు. నేను అప్పటికి పెద్ద డైరెక్టర్‌ని కాకపోవచ్చు. నన్ను గౌరవించకపోయినా ఫర్వాలేదు. వెంకటేష్‌లాంటి సీనియర్‌ని కూడా ఆమె పట్టించుకునేది కాదు. ఎంతో ఓపికగా భరించిన నేను ఒకసారి ఆమెతో ఈ విషయమై వాగ్వాదానికి దిగాను. దాంతో ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోయింది. ఇంకా ఆ సినిమాకి సంబంధించి ఒక పాట బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేయడానికి రమ్మని అడిగాను. తను వేరే సినిమాలతో బిజీగా ఉన్నానని, డేట్స్ ఎడ్జస్ట్ చెయ్యలేనని చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల ఆ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేశాం’ అని వివరించారు.
![]() |
![]() |