![]() |
![]() |

తెలుగు డైరెక్టర్ ని ఇండియన్ డైరెక్టర్ గా మార్చిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (S. S. Rajamouli)ఉరఫ్ జక్కన్న. ఇందులో ఎవరకి ఎలాంటి డౌట్ లేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన సృష్టించిన సంచలనం అందరి కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఎంత పెద్ద డైరెక్టర్ కి అయినా ప్లాప్ లు రావడం సహజం. కానీ జక్కన్న కి మాత్రం ఇంతవరకు అపజయం అనేదే లేదు. ప్రపంచ సినీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేత ప్రసంశలు అందుకున్న ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు.
జక్కన్న భార్య పేరు రమ.ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కూడాను. జక్కన్న భారీ సినిమాల విషయంలో ఆమె కాస్ట్యూమ్స్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తాజాగా వాళ్లిద్దరూ కలిసి ఒక పబ్లిక్ స్టేజ్‌పై డాన్స్ చేసారు. డాన్స్ అంటే ఏదో అల్లాటప్పాగా డాన్స్ వెయ్యడం కాదు. ఒక సినిమాలో హీరో హీరోయిన్లు ఎలా అయితే డాన్స్ చేస్తారో అచ్చం అలాగే వేశారు. ఇద్దరు పోటీ పడి మరి డాన్స్ చేసారు. పక్కా ప్రొఫిషనల్స్ గా వేసిన ఆ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ప్రేమికుడి సినిమాలోని అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటకు డాన్స్ చేసారు. అక్కడున్న వారంతా ఈలలు,అరుపులతో వాళ్ళని ఉత్సాహపరిచారు. కాగా రమ, రాజమౌళి లు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు.
ఇక జక్కన్న తన కొత్త మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)తో చెయ్యబోతున్నాడు. ఈ సినిమాపై ఇద్దరి ఫ్యాన్స్ లోను భారీ అంచనాలు ఉన్నాయి. పూర్తి స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యిందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే చెప్పాడు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా అది తెరకెక్కబోతుందనే ప్రచారం అయితే ఉంది. జక్కన్న గత చిత్రం ఆర్ఆర్ఆర్(RRR) 2022 లో వచ్చింది. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన మూడవ మూవీగా నిలిచింది. తన ప్రతి సినిమాకి ఒక్కో కొత్త రికార్డు సృష్టించే రాజమౌళి, మహేష్ మూవీకి ఎలాంటి కొత్త రికార్డు సృష్టిస్తాడో అనే క్యూరియాసిటీ అందరిలోను ఉంది.
![]() |
![]() |