Home

»

Latest News

ఇదెక్కడి మాస్ బ్యాటింగ్.. అట్లుంటది టిల్లు తోని!

Apr 1, 2024 1:05PM

ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీస్తే.. యంగ్ హీరో సినిమాకి కూడా స్టార్ హీరో సినిమా రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని 'టిల్లు స్క్వేర్'(Tillu Square) రుజువు చేస్తోంది. సూపర్ హిట్ మూవీ 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాలతో మార్చి 29న విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.68 కోట్ల గ్రాస్ రాబట్టిన 'టిల్లు స్క్వేర్'.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.

సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'టిల్లు స్క్వేర్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్ కి తగ్గట్టే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం, మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.23.7 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.21.6 కోట్ల గ్రాస్ రాబట్టగా.. మూడో రోజు రూ.22.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా రూ.68.1 కోట్ల గ్రాస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 'టిల్లు స్క్వేర్' జోరు చూస్తుంటే.. మొదటి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరేలా ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com