![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. నటుడిగా చరణ్ లోని కొత్త కోణాన్ని బయటపెట్టిన ఈ సినిమా అన్నా, ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ అన్నా చరణ్ ఫ్యాన్స్ కి ఎంతో అభిమానం. వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది అంటూ తాజాగా దర్శకధీరుడు రాజమౌళి రివీల్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. తాజాగా చెన్నైలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ను జరుపుతుంది. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. తారక్, చరణ్ పై ప్రశంసలు కురిపించారు. తారక్ లాంటి నటుడు దొరకడం తెలుగు సినిమాకి మాత్రమే కాదు ఇండియన్ సినిమాకే అదృష్టమని అన్నారు.
చరణ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా సెట్స్ కి వస్తాడని రాజమౌళి చెప్పారు. మీకేం కావాలో చెప్పండి అంటూ దాన్ని తను ఎలా చేయగలడో అని కూల్ గా ఆలోచించే మెంటాలిటీ అన్నారు. ఇంత కంఫర్టబుల్ గా ఉన్న నటుడిని నేను ఇప్పటివరకూ చూడలేదు అని రాజమౌళి చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ సందర్భంగా చరణ్-సుకుమార్ మూవీ గురించి రివీల్ చేశారు రాజమౌళి. చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చే నెక్స్ట్ మూవీ ఓపెనింగ్ సీక్వెన్స్ తనకు తెలుసు అని, చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. అయితే దాన్ని ఇప్పుడు రివీల్ చేయనని రాజమౌళి అన్నారు. రాజమౌళి వ్యాఖ్యలతో చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్ ఉందని కన్ఫర్మ్ అయింది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.
![]() |
![]() |