![]() |
![]() |

శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణలో 'స్నోబాల్ పిక్చర్స్' పతాకంపై తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ 'రెక్కీ'. 'కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు' అనేది ట్యాగ్ లైన్. ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీతో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా.. కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నాడు. అమీక్షా పవార్, జస్విక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
'రెక్కీ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన వేడుకలో ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకలో మూవీ టీమ్ పాల్గొంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న 'రెక్కీ' టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని మూవీ టీమ్ నమ్మకంగా ఉంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న 'రెక్కీ' చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |