![]() |
![]() |

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా కూడా రాజధాని ఫైల్స్ సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుందంటగా ఏ థియేటర్ లో టికెట్ బుక్ చేసావు అనే చర్చ జరుగుతుంది.అంతలా క్రేజ్ సంపాదించడానికి ప్రధాన కారణం ఇది మన సినిమా అనే విషయం ప్రతి వ్యక్తికి అర్ధం అయ్యింది. తాజాగా రాజధాని ఫైల్స్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ మూవీ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
రాజధాని ఫైల్స్ చిత్ర దర్శకుడు పేరు భాను. ఈయన గతంలో ఎన్నో మంచి చిత్రాలకి దర్శకత్వం వహించాడు.ఇప్పుడు ఆయన మాట్లాడుతు రాజధాని ఫైల్స్ రాజకీయాలకి సంబంధించిన సినిమా కాదు. ఇది పూర్తిగా రైతుల కోసం తీసిన సినిమా అని చెప్పారు.అలాగే సోషల్ మీడియాలో మా సినిమా కొన్ని రాజకీయ పార్టీలకి వ్యతిరేకం అనే వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలు పూర్తిగా అబద్దం. మా సినిమా ముమ్మాటికీ ఏ పార్టీ కి సపోర్ట్ కాదు.మాది జాతీయ జెండా లాంటి సినిమా జాతీయ జెండా అంటే ఎవరిదీ అని చెప్తాము అనే ఒక ఆసక్తికర వ్యాఖ్యలు కూడా భాను చేసారు. అలాగే చిత్ర నిర్మాణంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నింటిని అధిగమించి సినిమాని నిర్మించామని కూడా ఆయన చెప్పాడు.

రైతు పంట పండించి ఎలా అయితే బిడ్డల ఆకలిని తీరుస్తాడో అలాగే తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఒక రాజధాని ఉండాలని తమ భూములని ప్రభుత్వానికి ఇస్తే ఆ రైతుకి న్యాయం ఎందుకు జరగదు అనే కథాంశంతో రాజధాని ఫైల్స్ తెరకెక్కింది. ఫిబ్రవరి 15 న రెండు తెలుగు రాష్టాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న రాజధాని ఫైల్స్ ని తెలుగు వన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి శంకర్ కంఠంనేని నిర్మించగా హిమబిందు సమర్పకులుగా వ్యవరించారు.మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమా మీద అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |