![]() |
![]() |

రైతు దేశానికి వెన్నెముక అంటారు. కానీ ఆ రైతు కష్టాన్ని అర్థం చేసుకొని, వారికి గౌరవం ఇచ్చేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వారిలో 'రాజధాని ఫైల్స్' చిత్ర బృందం ముందు వరుసలో ఉంటుంది.
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ తోనే తెలుగునాట సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటన హృదయాలను హత్తుకుంది.
'రాజధాని ఫైల్స్' సినిమా కార్యక్రమానికి.. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి హాజరైన రైతులకు చిత్రం బృందం ఎంతో గౌరవమిచ్చింది. రైతుల చేత 'ఏరువాక' అనే పాటను లాంచ్ చేయించింది. రైతుల కోసం తీసిన సినిమా వేడుకలో, రైతుల చేత పాట విడుదల చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
![]() |
![]() |