![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'దేవర' (Devara)పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. (Saif Ali Khan Is Bhaira)
'దేవర'లో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో ఆయన భైర అనే పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. సైఫ్ పుట్టినరోజు(ఆగష్టు 16) సందర్భంగా భైర పాత్రను పరిచయం చేస్తూ తాజాగా గ్లింప్స్ ను విడుదల చేశారు. భైర గ్లింప్స్ అదిరిపోయింది. ఈమధ్య కాలంలో విలన్ పాత్రను పరిచయం చేస్తూ.. ఈ స్థాయి పవర్ ఫుల్ గ్లింప్స్ రాలేదనే చెప్పాలి. ఆయుధపూజను చూపిస్తూ, జనాల అరుపుల మధ్య 'భైర' పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. భైరను చాలా బలవంతుడిగా చూపించారు. విలన్ గా పాత్ర ఎంత బలంగా ఉంటే, అతన్ని ఢీ కొట్టే హీరో పాత్ర అంతలా ఎలివేట్ అవుతుంది. దేవర విషయంలో కొరటాల ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు.. 'భైర' గ్లింప్స్ తో అర్థమవుతోంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |