Home  »  News  »  Ram Charan: రామ్ చరణ్ కంటికి సర్జరీ.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!

Updated : Mar 26, 2026

  • 'పెద్ది' షూటింగ్‌లో రామ్ చరణ్‌కు ప్రమాదం
  • చరణ్ కంటి గాయంపై చిరంజీవి ఎమోషనల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) 'పెద్ది' మూవీ షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. చరణ్ కంటికి గాయం కావడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఆందోళనలన్నింటికీ తెరదించుతూ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'(Peddi) షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం(మార్చి 24) ఓ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా, చరణ్ ఎడమ కంటి పైభాగంలో చిన్న గాయమైంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్, ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ సుధాకర్ ప్రసాద్ నేతృత్వంలోని వైద్య బృందం చరణ్ కంటి రెప్పకు చిన్న సర్జరీ చేశారు. సుమారు నాలుగు కుట్లు పడినట్లు తెలుస్తోంది.

ఈ క్లిష్ట సమయంలో సకాలంలో స్పందించి, అత్యంత నైపుణ్యంతో చికిత్స అందించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. "చరణ్ కంటికి జరిగిన గాయం మాలో కొంత ఆందోళన కలిగించింది. కానీ మీ ఖచ్చితత్వం, శ్రద్ధ, నైపుణ్యం మా ఆందోళనను తొలగించాయి. మేము మీకు ఎంతో రుణపడి ఉంటాం" అంటూ చిరంజీవి తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

మెగాస్టార్ అప్‌డేట్‌తో ఊపిరి పీల్చుకున్న అభిమానులు, చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ తన డెడికేషన్ ను మరోసారి చాటుకున్నారు. కంటికి సర్జరీ జరిగినప్పటికీ, ఆయన ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మళ్ళీ షూటింగ్ కి రెడీ అయినట్లు సమాచారం. 

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. 

పెద్ది సినిమా ఏప్రిల్ 30, 2026న థియేటర్లలోకి రానుంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

https://x.com/KChiruTweets/status/2037029752184463719






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.