![]() |
![]() |

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ల గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా 'ఉప్పెన', 'పెద్ది' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
బుచ్చిబాబు తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉండబోతోందని, అది కూడా ఒక భారీ పౌరాణిక (మైథలాజికల్) కథాంశంతో తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలపై స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు.
తాజాగా 'పెద్ది' సక్సెస్ ప్రెస్ మీట్ లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బుచ్చిబాబు సమాధానమిస్తూ, మహేష్ బాబుతో సినిమా అనే అంశంపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చకపోవడం ఇక్కడ విశేషం.
ఈ ప్రాజెక్ట్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ.. "భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం, ఇండస్ట్రీలో పెద్దలందరూ ఉన్నారు కదా, అన్నీ కాలమే నిర్ణయిస్తుంది" అంటూ చాలా లౌక్యంగా, అర్ధవంతమైన కామెంట్స్ చేశారు. ఈ సమాధానంతో మహేష్ బాబు అభిమానుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.
మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో 'వారణాసి'తో అనే భారీ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులో కూడా మైథలాజికల్ అంశాలు ఉండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ తర్వాత బుచ్చిబాబుతో మహేష్ సినిమా ఉండే అవకాశం ఉంది.
బుచ్చిబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లాలని అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు బుచ్చిబాబు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |