![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పిరియడ్ డ్రామాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనుండగా.. కొమురం భీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ రెండు పాత్రలు ఎలా ఉండబోతున్నాయో.. ప్రచార చిత్రాల్లో స్పష్టతనిచ్చారు.
కాగా, రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మార్చి 27న విడుదల చేసిన `అల్లూరి సీతారామరాజు` స్పెషల్ పోస్టర్ కి సర్వత్రా మంచి స్పందన వచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు అదే తరహాలో గూస్ బంప్స్ నిచ్చే కొమురం భీమ్ స్పెషల్ పోస్టర్ ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేసిందట. తారక్ కి పర్ ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ లా ఈ పోస్టర్ ఉంటుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
`ఆర్ ఆర్ ఆర్`ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు. అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |