![]() |
![]() |

అన్నం తినకుండా మారాం చేస్తున్న పసి పిల్లవాడికి ఇళయరాజా(ilayaraja)పాట వినిపిస్తే చాలు..మరో ఆలోచన లేకుండా అన్నం తింటాడు. అంతటి ఘనకీర్తి కలిగిన ఇళయరాజా ఈ మధ్య తన సంగీతంతో కాకుండా నోటీసులతో చర్చల్లో నిలుస్తున్నాడు
మొన్న ఏప్రిల్ 5 న రెండు తెలుగు రాష్ట్రాల్లో మలయాళ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ (manjummel boys)విడుదల అయ్యింది. ఒరిజినల్ మాతృక లో ఫిబ్రవరి లో విడుదల అయ్యింది. రెండు చోట్ల కూడా ఘనమైన విజయాన్ని సాధించింది. కమల్ హాసన్ హీరోగా 1991 లో తెలుగు తమిళ భాషల్లో విడుదలైన మూవీ గుణ (guna)తమిళనాడు లోని కొడైకెనాల్ దగ్గరున్న గుహలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంది. దాంతో వాటికి గుణ గుహలు అనే పేరు వచ్చింది. ఆ గుహల నేపథ్యంలోనే మంజుమ్మేల్ బాయ్స్ తెరకెక్కింది. సినిమా క్లైమాక్స్ లో గుణ సినిమాలోని కమ్మని నీ ప్రేమ లేకనే రాసింది హృదయమే అనే పాట వస్తుంది. మలయాళ రిలీజ్ లో కూడా ఆ సాంగ్ వస్తుంది. ఇప్పుడు ఈ విషయంపైనే ఇళయరాజా తన లాయర్ ద్వారా మంజుమ్మేల్ బాయ్స్ టీం కి నోటీసులు పంపించాడు. నా పర్మిషన్ లేకుండా సినిమాలో వాడుకోవడం చట్ట విరుద్ధం. కాబట్టి నాకు నష్ట పరిహారం చెల్లించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసుల్లో పేర్కొన్నాడు.

సంగీతానికి చెందిన కాపీ రైట్ చట్టప్రకారం గుణ పాటల హక్కులు ఇళయరాజాకు చెంది ఉంటాయి. ఇటీవలే ప్రారంభం అయిన రజనీకాంత్ ,లోకేష్ కనగరాజ్ ల కూలీ కి కూడా నోటీసులు పంపించాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్ లో తను కంపోజ్ చేసిన సాంగ్ ని వాడుకున్నారన్నది ఇళయరాజా అభిప్రాయం. అది నిజం కూడా. తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లో ఇళయరాజా సంగీత కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది
![]() |
![]() |