![]() |
![]() |

తమిళ స్టార్ హీరో అజిత్(Ajith)ఈ నెల 10న 'గుడ్ బాడ్ అగ్లీ'(Good Bad Ugly)మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers)అజిత్ కెరిరీలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా అదిక్ రవిచంద్రన్(adhik Ravichandran)దర్శకత్వం వహించాడు.అజిత్ సరసన త్రిష(Trisha)జోడి కట్టగా అర్జున్ దాస్,ప్రసన్న ముఖ్య పాత్రలు పోషించారు.జీవి ప్రకాష్ కుమార్(Gv Prakashkumar)సంగీతాన్ని అందించాడు.
గుడ్ బాడ్ అగ్లీ థియేటర్స్ లోకి అడుగుపెట్టడానికి మూడు రోజులే ఉండటంతో అభిమానులు నెల్లైలోని బిఎస్ఎస్ థియేటర్ లో 285 అడుగుల అజిత్ భారీ కటౌట్ ని ఏర్పాటు చేసారు.కానీ ఇనుప రాడ్లతో నిర్మించిన ఆ కటౌట్ అభిమానులు చూస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకూలింది.దీంతో అభిమానులు భయంతో పరుగులు తీసి తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు.అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
.webp)
![]() |
![]() |