![]() |
![]() |

సాయం చేయడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మరోసారి ఆయన తన మంచి మనసుని చాటుకున్నారు. సినీ నటి వాసుకి(పాకీజా) దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్.. ఆమెకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు.
పాకీజాగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన వాసుకి.. తన ఆర్థిక పరిస్థితి అసలు బాలేదని, తనని ఆదుకోవాలని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి చేరడంతో.. పాకీజాకి సేవ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ తరపున మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో రెండు లక్షల రూపాయలను శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు.
పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.
![]() |
![]() |