![]() |
![]() |

కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'పంచాయత్ సీజన్ 4' (Panchayat 4)అనే హిందీ వెబ్ సిరీస్ జూన్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతు ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తుతుంది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, శాన్విక పూజా సింగ్(sanvikaa Pooja Singh),చందన్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా రింకీ దూబే క్యారక్టర్ ని పోషించిన శాన్విక తన నటనతో 'పంచాయత్ సీజన్ 4'కి అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.
రీసెంట్ గా శాన్విక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. పంచాయత్ 4 కథని నాకు చెప్పినప్పుడు ఎలాంటి ముద్దు సన్నివేశాలు లేవు. కానీ ఆతర్వాత కథలో మార్పులు చేసి ముద్దు సన్నివేశాలు ఉన్నాయని, చెయ్యాల్సిందే అని చెప్పారు. ఈ విషయంలో కొంచం టైం కావాలని అడిగాను. ఆ తర్వాత రెండురోజులు బాగా ఆలోచించి, ఈ సిరీస్ ని కుటుంబసభ్యులందరు కలిసి చూస్తారు కాబట్టి ముద్దు సన్నివేశంలో నటించకూడదని అనుకోని, ఆ విషయాన్నే దర్శక నిర్మాతలకి చెప్పాను. వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని గౌరవించి కథలో మార్పులు చేసారని శాన్విక చెప్పుకొచ్చింది.
ఫులేరా అనే గ్రామంలో జరిగే ఎన్నికల ఆధారంగా 'పంచాయత్ సీజన్ 4 ' తెరకెక్కింది. దీపక్ మిశ్ర(Deepak Kumar Mishra)దర్శకత్వంలో ది వైరల్ ఫీవర్ సంస్థ నిర్మించగా గతంలో ఈ సిరీస్ నుంచి వచ్చిన మూడు సీజన్లు కూడా ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తాయి.

![]() |
![]() |