Home  »  News  »  పవన్ కళ్యాణ్ 'OG' సీక్వెల్‌పై తమన్ సంచలన అప్‌డేట్.!

Updated : Aug 5, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ గ్యాంగ్ స్టర్ మూవీ 'OG' సీక్వెల్‌ 'OG2' కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్తుందని ఆ మధ్య గట్టిగా న్యూస్ వినిపించినా.. కొద్దిరోజులుగా మళ్ళీ ఎలాంటి సౌండ్ లేదు. 'OG2'పై సస్పెన్స్ నెలకొన్న ఇలాంటి టైంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బిగ్ అప్‌డేట్ ఇచ్చేశారు.

'కొరియన్ కనకరాజు' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమన్ వేదికపై మాట్లాడుతుండగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ "OG.. OG.." అంటూ నినాదాలతో హోరెత్తించారు. దానికి తమన్ స్పందిస్తూ.. "ఇంకా ఆగస్టులోనే ఉన్నాం. సెప్టెంబర్ కి వస్తాం. అందుకే గడ్డం, మీసం పెంచుతున్నా. మళ్ళీ మీసం తిప్పాలి కదా." అన్నారు.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'OG2' స్పెషల్ యానిమేషన్ అనౌన్స్ మెంట్ వీడియో వస్తుందని గతంలో న్యూస్ వచ్చింది. ఇప్పుడు తమన్ మాటలను బట్టి చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది.

అయితే 'OG2' షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే డైరెక్టర్ సుజీత్ నెక్స్ట్ నానితో 'బ్లడీ రోమియో' అనే సినిమా చేయాల్సి ఉంది. ఇది అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. అదే జరిగితే, 2027 సమ్మర్ తర్వాత 'OG2' పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

 

 

Pawan Kalyan, OG 2 Update, Thaman, Korean Kanakaraju

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.