![]() |
![]() |

మాగ్జిమమ్ భారతదేశంలోని అన్ని భాషల్లో దగ్గర దగ్గరగా పద్దెనిమిది వేల పాటలు పాడిన గానకోకిల శ్రీమతి సుశీల(p.susheela)అన్ని బాషల వాళ్ళు సుశీలమ్మ అని పిలుచుకుంటారు. ఒక్క తెలుగులోనే పన్నెండు వేల కి పైగా పాటలు పాడారు. దీన్ని బట్టి తెలుగు నాట ఆమె గానామృతం ఎంత దేదీప్యమానంగా వెలుగొందిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె అభిమానులకి ఒక తీపి కబురు వచ్చింది.
సుశీలమ్మ గత శనివారం సాయంత్రం అస్వస్థతకి లోనవడంతో చెన్నై కావేరీ హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం అందరకి తెలిసిందే. దీంతో లక్షలాది మంది అభిమానుల్లో కలవర పాటు మొదలయ్యింది. అంతే కాకుండా ఎప్పటికపుడు సుశీలమ్మ ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే ఉన్నారు. పలువురు అమ్మ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు కూడా చేసారు. ఇప్పడు వాళ్ళందరి ప్రార్థనలు ఫలించాయి. సుశీలమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు అధికార ప్రకటన వచ్చింది.
ఇక సుశీలమ్మ కూడా తన అభిమానులకి ఒక సందేశాన్ని పంపించారు. మీ అందరి ప్రార్థనలు ఫలించి హాస్పిటల్ నుంచి ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఇంటికి వచ్చాను.మీ అందరూ చల్లగా ఉండాలి అని తెలిపింది.
![]() |
![]() |