![]() |
![]() |

సంగీత(sangeetha)1997 లో సురేష్ గోపి హీరోగా మలయాళంలో తెరకెక్కిన గంగోత్రి ద్వారా సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టింది. అదే సంవత్సరం అలీ హీరోగా వచ్చిన సర్కస్ సత్తిపండు ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. జగపతి బాబు, శ్రీకాంత్, రవితేజ వంటి స్టార్స్ సరసన చేసి మంచి నటిగా గుర్తింపు పొందింది. తమిళంలో కూడా సుమారు పది సినిమాల దాకా చేసింది. విక్రమ్ ,సూర్య ల పితామగన్ అయితే సంగీతకి ఎనలేని కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెట్టింది.ఆ మూవీ శివ పుత్రుడు గా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక సంగీత లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తమిళ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా మారాయి.
నాకు తమిళ చిత్రాల్లో నటించడం కంటే తెలుగు సినిమాల్లోనే నటించడం ఇష్టం. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ లోనే ఎక్కువ గౌరవం లభిస్తుంది. తమిళ అభిమానులు నా పై ఆగ్రహం వ్యక్తం చేసినా పర్లేదు.కానీ నేను చెప్పేది నిజం. తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ . అసలు తమిళంలో చేస్తునప్పుడు సరైన గౌరవ మర్యాదలు
కూడా ఉండవని చెప్పుకొచ్చింది. అలాగే మరికొన్ని విషయాలని కూడా నిర్మొహమాటం లేకుండా చ్చెపింది.అవకాశాల కోసం తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన వాళ్ళని నేను ఏనాడూ అడగలేదు. తెలుగులో నాకు అవకాశాలతో పాటు మంచి పారితోషకం వస్తుందని ఎవరకి కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. కానీ కొంత మంది ఫోన్ చేసి ఒక క్యారక్టర్ గురించి చెప్తారు. వాళ్ళేదో నాకు జీవితాన్ని ఇస్తున్నట్టుగా మాట్లాడతారు. పైగా కరెంటు బిల్ కట్టుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవన్నట్టుగా మాట్లాడతారు.
అదే విధంగా నా పారితోషకాన్ని కూడా వాళ్లే నిర్ణయించి కేవలం నటించి వెళ్లండని అంటారు. ఎన్నో సార్లు రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటాను. కానీ వాళ్లే నాకు ఇవ్వరు.అందుకే తమిళ సినిమాల్లో నటించనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టీవీ షోలకి హాజరవుతున్న సంగీత మధ్య మధ్యలో అవకాశాలు వస్తే మాత్రం వదులుకోవడం లేదు. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)ఆచార్య లో శివుడి కి సంబంధిచిన సాంగ్ లో చేసింది. ఇక్కడ ఇంకో ఆసక్తి కర విషయం ఏంటంటే సంగీత తమిళనాడుకి చెందిన అమ్మాయి. 2009 లో ప్రముఖ తమిళ సినీ గాయకుడు క్రిష్ ని వివాహం చేసుకుంది. ఒక కూతురు కూడా ఉంది.
![]() |
![]() |