![]() |
![]() |

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా గుర్తింపుని పొంది అక్కడ నుంచి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తు తన కంటు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్న నటుడు సందీప్ కిషన్(sundeep kishan). అలాగే ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, టైగర్, డిస్కో రాజా వంటి విభిన్నమైన చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు వి.ఐ ఆనంద్(v.i anand)ఇప్పుడు వీరిద్దరు కలిసి ఒక సరికొత్త చరిత్రని సృష్టించడానికి సిద్ధమయ్యారు.
ఆ ఇద్దరి కాంబోలో తాజాగా ఊరి పేరు బైరవ కోన( Ooru Peru Bhairavakona)అనే మూవీ వస్తుంది. ఎడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్నఈ మూవీ ట్రైలర్ కొంతసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఒక సరికొత్త కధాంశంతో తెరకెక్కిన బైరవకోన ట్రైలర్ ని చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వస్తున్నాయి.అలాగే మూవీలో విజువల్స్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతున్నాయనే విషయం అర్ధం అవుతుంది. చేతికి అంటిన రక్తాన్ని అయితే తుడుచుకోవచ్చు గాని చేసిన పాపాన్ని తుడుచుకోలేము అని ట్రైలర్ చివరలో వచ్చిన డైలాగ్ అయితే సూపర్ గా ఉంది. అలాగే ఆ ఒక్క డైలాగ్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తిని కూడా కలిగించింది.

ఈ ఊరి పేరు భైరవ కోన లో సందీప్ కిషన్ తో పాటు వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, ఖుషి రవి, వెన్నెల కిషోర్, హర్ష తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించగా రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
![]() |
![]() |