![]() |
![]() |

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులని పరిచయం చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన గుంటూరు కారం సినిమాతో మరో కొత్త రికార్డుని పరిచయం చేసాడు. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు కొడితే సౌత్ ఇండియా మొత్తం షేక్ అవ్వాలనేంత రికార్డు. ఇప్పుడు ఈ రికార్డు తో మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
మహేష్ గుంటూరు కారం 100 కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలైన రెండు రోజులకే ఈ ఘనతని సాధించింది. అలాగే మహేష్ గత చిత్రాలైన భరత్ అనే నేను, మహర్షి ,సరిలేరు నీకెవ్వరు, సర్కారువారిపాట సినిమాలు కూడా 100 కోట్లు సాధించాయి. దీంతో దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తంలోనే వరుసగా ఐదు సినిమాల ద్వారా 100 కోట్లు కలెక్షన్స్ ని సాధించిన ఏకైక సౌత్ హీరోగా మహేష్ బాబు నిలిచాడు
దీంతో ఇప్పుడు తెలుగు ప్రజల ఇళ్లల్లో ఒక చర్చ నడుస్తుంది. మహేష్ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న వచ్చింది. మిడ్ నైట్ నుంచే షోస్ పడ్డాయి.మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్.పైగా రివ్యూస్ కూడా బ్యాడ్ గానే వచ్చాయి. మరి ఈ కలెక్షన్స్ ఏంటనుకుంటు జై మహేష్ ఛలో గుంటూరు కారం అంటు ఫ్యామిలీ ఫ్యామిలీ లు థియేటర్స్ కి పోటెత్తుతున్నారు.
![]() |
![]() |