![]() |
![]() |

కొణిదెల నిహారిక నాగబాబు గారాల పట్టి గురించి మనకు ఆల్రెడీ ఎన్నో విషయాలు తెలుసు. కానీ ఇంకా కొన్ని కొత్త విషయాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. "నేనెప్పుడూ మా అమ్మని, నాన్నని, అన్నని వదిలేసి ఉండలేదు. పెళ్లి చేసుకోబోతున్నాం అంటే వాళ్ళు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే వెళ్లే చోట ఎవరూ మన పేరెంట్స్ లా ఉండరు, చూసుకోరు...నా లైఫ్ లో నా పెళ్లి నన్ను కొంచెం అప్ సెట్ చేసింది. కానీ ఆ బాధ తాలూకు గాయాల్ని మర్చిపోతున్నా. నేను సోషల్ మీడియా ఫాలో అవుతాను. ఆ థంబ్ నెయిల్స్ అవి చూస్తాను. బాదేసినా వాటిని అక్కడితో వదిలేస్తాను. మా నాన్నకు నేను హ్యాపీగా ఉండడమే చాలా ఇంపార్టెంట్.
మా ఇంట్లో ఎవరూ కూడా నేను బరువు అని ఎప్పుడూ అనుకోరు. నేను ట్రావెల్ చేయాలి, నా వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయాలి..ఇంకా చాలా చేయాలి లైఫ్ లో..నాకు నాగబాబు లాంటి నాన్న దొరకడం నిజంగా అదృష్టమని చెప్పాలి. ఇప్పుడు నా వయసు 30 ..మళ్ళీ పెళ్లి అంటే అది ఇప్పుడు కష్టం.. కానీ దాని వెంట నేను పరిగెత్తాలనుకోవడం లేదు. లైఫ్ ఎలా ఎప్పుడు ఏం ఇస్తుందో అదే తీసుకుంటాను. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఈసారి ఎన్నికల్లో కూడా నేను జనసేన తరపున ప్రచారం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ కి ఎవరైతే నాయకుడు అవసరమో ఆయనకే ఓటు వేస్తాను. పవన్ కళ్యాణ్ పొలిటిషన్ కాదు. ఒక లీడర్ మాత్రమే..మా బాబాయికి ఎప్పుడు ప్రజల గురించే ఆలోచనే ఉంటుంది. ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తారు. బాలీ, గోవా, టర్కీ అంటే చాలా ఇష్టం. రీసెంట్ గా థాయిలాండ్ వెళ్లాను. నాకు ఏనుగులు అంటే చాలా ఇష్టం. ఇంకా నా ప్రొడక్షన్ పేరు కూడా పింక్ ఎలిఫెంట్. ఐదేళ్ల తరువాత మళ్లీ సినిమాలు చేయడం హ్యాపీగా ఉంది. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ మూవీస్ తీస్తున్నా..నాకు డబ్బులు అవసరమైతే మా నాన్ననే అడుగుతాను" అని చెప్పుకొచ్చింది నిహారిక.
![]() |
![]() |