![]() |
![]() |
మాస్ రాజా రవితేజ గురించి పరిచయ వాక్యాలు అక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగిన రవితేజ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. కేవలం టాలెంట్‌తోనే ఈ స్థాయికి వచ్చాడు. తను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకునే రవితేజ టాలీవుడ్‌లో ఇప్పుడు టాప్ డైరెక్టర్లు కొనసాగుతున్న కొంతమంది అతని సినిమాల ద్వారానే దర్శకులుగా పరిచయమయ్యారు. సుదీర్ఘమైన కెరీర్ కలిగివున్న రవితేజ ఇప్పటికీ తన సినిమాలతో యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలబడుతున్నాడు. ఈరోజు(జనవరి 26) మాస్‌రాజా రవితేజ పుట్టినరోజు.
ఈ సందర్భంగా అతను చేస్తున్న తాజా సినిమాకి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను షేర్ చేశారు. హరీష్ శంకర్‌ను ‘షాక్’ చిత్రంతో దర్శకుడ్ని చేసిన రవితేజ ఆ తర్వాత ‘మిరపకాయ’తో సూపర్‌హిట్ కొట్టాడు. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా వస్తోంది ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ‘రైడ్’ చిత్రాన్ని ‘మిస్టర్ బచ్చన్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ అంతా కరైకుడి పయనమైంది. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫోటోలను షేర్ చేసారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంకా బోస్ కెమెరా బాధ్యతలు చేపట్టారు.
![]() |
![]() |