Home  »  News  »  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన నిధి 

Updated : Aug 12, 2025

'ఇస్మార్ట్ శంకర్'తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal), లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కలిసి చేసిన 'హరిహర వీరమల్లు'(Harihara veeramallu)తో మరింతగా చేరువయ్యింది. 'పంచమి' అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసిందనే కితాబుని కూడా అందుకున్న నిధి,రీసెంట్ గా ఏపి(Ap)లోని భీమవరం(Bhimavaram)లో  జరిగిన ఒక 'స్టోర్' కార్యమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి(Ap Government)చెందిన అధికార వాహనంలో సదరు కార్యక్రమానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

ఈ విషయంపై 'నిధి' ఎక్స్ వేదికగా స్పందిస్తు 'ఈవెంట్ నిర్వహకులు నా కోసం ఏర్పాటు చేసిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే. కానీ అధికారులే నా కోసం వాహనాన్ని పంపించినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. అధికారులు నాకు ఎలాంటి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చెయ్యలేదు. . నా అభిమానులకి వాస్తవాలని చెప్పడం నా బాధ్యత. ఆ వాహనాన్ని ఏర్పాటు చేసే విషయంలో నా పాత్ర ఏం లేదు. నా ప్రతి విషయంలోను ప్రేమ, సహకారం అందిస్తున్న నా అభిమానులకి ధన్యవాదాలు అంటు ఎక్స్ వేదికగా పేర్కొంది.

నిధి ప్రస్తుతం 'ది రాజాసాబ్'(The RajaSaab)లో ప్రభాస్(Prabhas)సరసన చేస్తుంది. ఆమె కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో రాజాసాబ్ లో ప్రభాస్ లవర్ గా, ఇంపార్టెంట్ రోల్ లో చేస్తుందనే విషయం అర్ధమవుతుంది. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న రాజాసాబ్  ద్వారా నిధి అగ్ర హీరోయిన్ అనే టాగ్ లైన్ ని సంపాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2018 లో అక్కినేని 'నాగచైతన్య'(Naga chaitanya)తో కలిసి చేసిన సవ్యసాచితో నిధి తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.