![]() |
![]() |

కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట బాలీవుడ్ లో ఎక్కువగా వింటుంటాం. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ సౌత్ ఇండియాకు కూడా పాకిందని అంటున్నారు. 'కూలీ' సినిమా కోసం పెద్ద ఎత్తున కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Coolie Bookings)
ఆగస్టు 14న ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ చూడబోతుంది. ఆరోజు 'వార్-2', 'కూలీ' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే 'వార్-2' బుకింగ్స్ స్లో అండ్ స్టడీ అన్నట్టుగా ఉండగా.. 'కూలీ' బుకింగ్స్ మాత్రం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచే రేంజ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. కూలీకి కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని కంపెనీలు ఎంప్లాయిస్ కోసమని మొత్తం థియేటర్లనే బుక్ చేస్తున్నట్లు ఒక థియేటర్ యజమాని చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. (Coolie vs War 2)
కార్పొరేట్ బుకింగ్స్ అంశం తెరపైకి రావడంతో ఇతర హీరోల అభిమానులు 'కూలీ' సినిమాని టార్గెట్ చేస్తున్నారు. హైప్ ని క్రియేట్ చేయడానికి కార్పొరేట్ బుకింగ్స్ ని నమ్ముకున్నారని లేదంటే ఈ రేంజ్ బుకింగ్స్ అసలు సాధ్యం కాదని కొందరు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.
![]() |
![]() |