Home

»

Latest News

బ‌ర్త్ డే మంత్ లో ధ‌నుష్ డ‌బుల్ ధ‌మాకా!

May 22, 2022 5:31PM

వైవిధ్యానికి పెద్ద‌పీట వేసే ద‌క్షిణాది క‌థానాయ‌కుల్లో ధ‌నుష్ ఒక‌రు. కేవ‌లం మాతృభాష త‌మిళంకే ప‌రిమితం కాకుండా ఇత‌ర భాష‌ల్లోనూ సంద‌డి చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ టాలెంటెడ్ స్టార్. ఈ క్ర‌మంలోనే.. త్వ‌ర‌లో టాలీవుడ్ లోనూ నేరుగా ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు ధ‌నుష్. `సార్` పేరుతో త‌యార‌వుతున్న ఈ బైలింగ్వ‌ల్ మూవీని వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్నాడు.

ఇదిలా ఉంటే, ఈ ఏడాదిలో ఇప్ప‌టికే `మార‌న్` చిత్రంతో అల‌రించిన ధ‌నుష్.. త‌న బ‌ర్త్ డే మంత్ అయిన జూలైలో ఏకంగా రెండు సినిమాల‌తో రాబోతున్నారు. ఆ చిత్రాలే.. `తిరుచిత్రాంబ‌ళ‌మ్`, `ద గ్రే మ్యాన్`.  ఆ వివ‌రాల్లోకి వెళితే.. మిత్ర‌న్ జ‌వ‌హ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాశీ ఖ‌న్నా, నిత్యా మీన‌న్ తో క‌లిసి ధ‌నుష్ న‌టించిన కోలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా `తిరుచిత్రాంబ‌ళ‌మ్` జూలై 1న విడుద‌ల‌కు రెడీ కాగా.. ఆంటోని రుస్సో, జోయ్ రుస్సో డైరెక్ష‌న్ లో ధ‌నుష్ ఓ ముఖ్య పాత్ర‌ధారిగా రూపొందిన అమెరిక‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ద గ్రే మ్యాన్` జూలై 15న యునైటెడ్ స్టేట్స్ థియేట‌ర్స్ లో, జూలై 22న నెట్ ఫ్లిక్స్ లో సంద‌డి చేయ‌నుంది. మ‌రి.. త‌క్కువ గ్యాప్ లోనే వ‌స్తున్న ఈ చిత్ర ద్వ‌యాల‌తో ధ‌నుష్ ఏ స్థాయిలో ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com