![]() |
![]() |

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'దసరా' మూవీ బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘన విజయంతో అభిమానుల్లో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలను పెంచేశాయి. దానికి తగినట్లే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచే టాలీవుడ్ వర్గాల్లోనూ, సగటు సినిమా ప్రేమికుల్లోనూ విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.
అయితే, ప్రస్తుతం ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చుట్టూ ఫిలిం నగర్ సర్కిల్స్ లో రకరకాల గుసగుసలు శరవేగంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వెనక్కి జరిగిపోతోందని, ఏకంగా డిసెంబర్ నెలకు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
మరో ఐదు రోజుల టాకీ పార్ట్ తో పాటు, రెండు సాంగ్స్ చేస్తే 'ది ప్యారడైజ్' షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. దాంతో షూటింగ్ ఆలస్యం వల్ల సినిమా వాయిదా పడే అవకాశం లేదు. కానీ, ఇందులో సీజీ వర్క్ ఎక్కువగా ఉందట. ఒకవేళ సీజీ వర్క్ ఆలస్యమైతే మరోసారి మూవీ వాయిదా పడుతుందని, లేదంటే ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Nani, The Paradise, Srikanth Odela
![]() |
![]() |