Home  »  News  »  ఓటీటీ ఆఫర్లు కూడా దక్కించుకోలేకపోతున్న టాలీవుడ్ హీరో... ఫ్యాన్స్ షాక్ 

Updated : Jul 25, 2026

 

హీరో(Hero).. ఆ  ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, హీరో అనే వర్డ్ వినగానే అభిమానులు, ప్రేక్షకుల్లో ఒక ఉద్వేగం ఉంటుంది. సెల్యులాయిడ్ పై తను చేసేది నటనే అయినా తను నవ్వితే నవ్వుతారు, భావోద్వేగంతో ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. పోరాటాలు చేస్తుంటే హీరో అంటే ఇది అంటూ వాళ్ళు కూడా పోరాటాలు చెయ్యడానికి ట్రై చేస్తుంటారు.హీరో పోస్ట్ కి అంత కెపాసిటీ ఉంది. కానీ ఇప్పుడు ఆ హీరోకి సబంధించిన న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్, సోషల్ మీడియాలో అందరికి హాయ్ చెప్తుంది.

ఆ హీరోకి వెండితెరపై ప్రధాన కథానాయకుడిగా అవకాశాలు తగ్గి చాన్నాళ్లయింది. దీంతో ఆయన కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా క్యారెక్టర్ రోల్స్, విలన్ వేషాల వైపు అడుగులు వేశారు. పరిశ్రమలో ఆయనకు "మంచి నటుడు" అనే బలమైన  ఇమేజ్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తగినన్ని హిట్ సినిమాలు లేకపోవడమే అతిపెద్ద ప్రతిబంధకంగా మారింది. వరుస ప్లాప్‌ల ప్రభావంతో వెండితెరపై గ్రాఫ్ పడిపోవడంతో, ఎలాగైనా ఒక భారీ ఓటీటీ ప్రాజెక్ట్ లేదా ఒరిజినల్ వెబ్ సిరీస్ ద్వారా తన డిజిటల్ ఎంట్రీని ఘనంగా ప్లాన్ చేయాలని భావించాడు. గతంలో సదరు హీరోతో ఒరిజినల్ సిరీస్‌లు చేయడానికి అనేక ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రతినిధులు స్వయంగా సంప్రదింపులు జరిపేవారు. దాంతో వారి వద్దకే వెళ్తే పని సులువుగా పూర్తవుతుందనే నమ్మకంతో, ఆ హీరో తనే స్వయంగా వెళ్లి పాత సంబంధాలను కదిలించాడు. కానీ, అక్కడ ఆ హీరోకి ఊహించని షాక్ ఎదురైంది. ఒకప్పుడు ఆయనతో ప్రాజెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపించిన ఆ ప్లాట్‌ఫామ్‌ల నిర్వాహకులు, ఇప్పుడు నేరుగా "నో" అని చెప్పడం మొదలుపెట్టారు. దీనికి కారణం  ఓటీటీ మార్కెట్‌లో పెరిగిన విపరీతమైన పోటీనే కారణమని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also read: OG 2: ఓజి 2 క్రేజీ న్యూస్.. ఫ్యాన్స్ లో జోష్  


ప్రస్తుతం ఓటీటీ ప్రపంచం మునుపటి కంటే చాలా వేగంగా రూపాంతరం చెందింది. రానా దగ్గుబాటి, వెంకటేష్, నాగచైతన్య వంటి అగ్ర నటులు ఇప్పటికే డిజిటల్ కంటెంట్, భారీ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతూ ఎంట్రీ ఇచ్చేశారు. మరోవైపు, ఇటీవల థియేటర్లలో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తేజ సజ్జాతో పాటు సందీప్ కిషన్ వంటి యువ కథానాయకులు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై తమ ముద్ర వేస్తున్నారు. ఓటీటీ మేకర్ల వద్ద ఒక శక్తివంతమైన కథ లేదా మంచి సబ్జెక్ట్ సిద్ధంగా ఉన్నప్పుడు, వారు నాగార్జున లాంటి పెద్ద స్టార్లను గానీ లేదా నాగచైతన్య, సాయిదుర్గ తేజ్ వంటి యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోలను గానీ ఒప్పించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో, ఇటీవల సరైన విజయం లేని ఫ్లాప్ హీరోతో సిరీస్ తీస్తే వ్యాపారాత్మకంగా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే ఆలోచనతో డిజిటల్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ఈ ఒక్క సమీకరణం వల్లే ఆయన పెట్టుకున్న ఓటీటీ భారీ ప్రాజెక్ట్ ఆశలన్నీ గల్లంతయ్యాయి. అయితే సదరు హీరోకి ఒక రీజనల్ లేదా లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుండి ఓపెన్ ఆఫర్ ఉన్నప్పటికీ, దాని స్థాయి చిన్నది కావడం వల్ల ఆయన దానిపై అసలు  ఆసక్తి చూపించడం లేదట. సినిమా చాన్స్ పోయినా ఓటీటీ ఆదుకుంటుందనుకుంటే, అక్కడ కూడా లభించిన ఈ షాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

#Ott #Hero #Tollywood

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.