![]() |
![]() |

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగా.. వచ్చే సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే నాగ్ అభిమానులు తమ వింటర్ నాగార్జునని చూడబోతున్నామనే ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే నాగార్జున ని అభిమానించే మాస్ ప్రేక్షకులు కొన్ని లక్షల మంది ఉంటారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ ని చిత్ర యూనిట్ పరిచయం చేసింది. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నా సామిరంగాలో నాగార్జున సరసన ఆషికా రంగనాధ్ హీరోయిన్ గా చేస్తుంది. మేకర్స్ తాజాగా వరలక్ష్మి పాత్రలో నటిస్తున్న ఆషికా ని పరిచయం చేసారు.నిండుగా చీర కట్టుకొని ఓరచూపు చూస్తున్న ఆమె లుక్ సూపర్ గా ఉంది. అలాగే నాగార్జున కూడా దొంగ చాటుగా ఆమెని చూస్తున్నట్టు ఉండే నా సామిరంగా గ్లిమ్స్ టోటల్ గా అదిరిపోయింది. కానీ ఇప్పుడు కొంత మంది ఆషికా ని చూస్తుంటే మరి చిన్న పిల్లల ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది ఏమో కథలోని పాత్రకి తగ్గట్టుగా తీసుకొని ఉంటారని అంటున్నారు.

ఇటీవల చిరంజీవి, బాలకృష్ణలు కూడా తమ సరసన నటించే హీరోయిన్ల విషయంలో పలు విమర్శలని ఎదుర్కున్నారన్న విషయం తెలిసిందే. నా సామిరంగా సినిమాకి బెజవాడ ప్రసన్న కుమార్ మాటలని అందిస్తుండగా ప్రముఖ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మలయాళ మూవీ పోరింజు మరియం జొస్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది.
![]() |
![]() |