![]() |
![]() |

తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త కాంబినేషన్ తో కూడిన అధ్బుతం జరుగనుందా? ఒక వేళ అదే కనుక జరిగితే ఇంకొన్ని అధ్బుతమైన కాంబినేషన్ లలో మరిన్ని చిత్రాలు తెరకెక్కే అవకాశం ఉంది. నాచురల్ స్టార్ నాని ఈ నెల 7 న రాబోతున్న తన కొత్త చిత్రం హాయ్ నాన్న ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సందర్భంగా నాని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా కొంత మంది అభిమానులు నానితో వేసిన ఒక ప్రశ్నకి నాని చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఫిలిం సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తుంది.
నానితో ఒక అభిమాని మీకు ఎవరి డైరెక్షన్ లో నటించాలని ఉందని అడిగాడు.అందుకు నాని నాకు వేణు దర్శకత్వం లో నటించాలని ఉందనే సమాధానం ఇచ్చాడు. వేణు అంటే ఎవరో కాదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి రీసెంట్ గా బలగం సినిమాతో డైరెక్టర్ గా మారి బలగం వేణుగా పిలవబడుతున్న జబర్దస్ వేణు తో. ఇప్పుడు నాని చెప్పిన ఈ సమాధానంతో ఈ ఇద్దరి కాంబోలో సినిమా కోసం ఇరువురి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

నాని తన తాజా చిత్రం హాయ్ నాన్న తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని తన కొత్త చిత్రాన్ని ఏది ప్రకటించలేదు. దీంతో బలగం వేణు కనుక ఒక మంచి కథ తో నాని ని ఒప్పిస్తే నాని సినిమా చెయ్యడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే నానినే స్వయంగా బలగం వేణు డైరెక్షన్ లో నటించాలని ఉందని అన్నాడు కాబట్టి వేణు నాని తో సినిమా చెయ్యడం ఈజీ అని అంటున్నారు.
![]() |
![]() |