Home  »  News  »  మా పెద్ద అబ్బాయి.. ఎన్టీఆర్‌పై నాగార్జున ఎమోషనల్ కామెంట్స్.!

Updated : Jul 11, 2026

ఇటీవల విడుదలైన అక్కినేని అఖిల్ సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సాధించిన ఘన విజయం పట్ల అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వైభవంగా నిర్వహించిన 'లెనిన్' సక్సెస్ మీట్ వేడుకలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ ఎంతటి కీలక పాత్ర పోషించిందో నాగార్జున ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.

"నా పెద్ద పెద్ద అబ్బాయి తారక్" అంటూ లెనిన్ లో ఎన్టీఆర్ ఎలా భాగమయ్యారో నాగార్జున గుర్తు చేసుకున్నారు. సినిమా ప్రారంభంలో కథను సరికొత్తగా, ఆసక్తికరంగా ముందుకు నడిపించడానికి ఒక బలమైన వాయిస్ ఓవర్ అవసరమని చిత్ర బృందం భావించిందని నాగార్జున వెల్లడించారు. ఈ విషయంలో నేను, చిత్ర దర్శకుడు, అఖిల్, నిర్మాత నాగవంశీ, ఎడిటర్ నవీన్ అందరం కలిసి చర్చించామని ఆయన చెప్పారు. ఈ కథకు ప్రాణం పోస్తూ, సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ఆ పవర్‌ఫుల్ వాయిస్ ఎవరిదైతే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు, అందరి నోట వినిపించిన ఒకే ఒక్క పేరు తారక్ అని నాగార్జున స్పష్టం చేశారు.

నా పెద్ద పెద్ద అబ్బాయి లాంటి తారక్‌ను ఈ వాయిస్ ఓవర్ కోసం అడగగానే, ఆయన ఏమాత్రం సంకోచించకుండా, కథలోని ప్రాధాన్యతను గుర్తించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని నాగార్జున ఎంతో సంతోషంగా పంచుకున్నారు. సినిమా బిగినింగ్ స్టేజ్ నుండి ఎంతో ఆసక్తిని కలిగిస్తూ, ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్లడంలో తారక్ వాయిస్ వంద శాతం న్యాయం చేసిందని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కు నాగార్జున వేదికపై హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 

నాగార్జున తన స్పీచ్ లో తారక్‌ను 'నా పెద్ద పెద్ద అబ్బాయి' అని సంబోధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' మూవీ ఈవెంట్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాగా.. అప్పుడు నాగ్ ఇలాగే  తారక్‌ను 'నా పెద్ద పెద్ద అబ్బాయి' అని పిలవడం విశేషం. 

 

 

Akhil Akkineni, Lenin Movie, Nagarjuna, Jr NTR

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.