![]() |
![]() |

సినిమా వారికి సెంటిమెంట్ లు ఎక్కువ. ఏదైనా కాంబినేషన్ లో హిట్ కొడితే.. మళ్ళీ అదే కాంబో రిపీట్ చేస్తుంటారు. లేదా ఏదైనా లొకేషన్ లో షూట్ చేస్తే.. మళ్ళీ అదే లొకేషన్ లో షూట్ చేయడానికి ఇష్టపడతారు. అలాంటి సెంటిమెంట్ లొకేషన్ ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దాని పేరు సినిమా చెట్టు. (Cinema Chettu)
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి నది తీరాన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గన్నేరు చెట్టు ఉంది. ఈ చెట్టు దగ్గర వందల చిత్రాలు షూటింగ్ జరుపుకోవడంతో.. దానికి సినిమా చెట్టు అనే పేరు వచ్చింది. తమ సినిమాలో ఈ చెట్టును చూపిస్తే హిట్ కొట్టినట్టే అని ఎందరో నిర్మాతలు బలంగా నమ్మేవారు. అంతటి చరిత్రగల ఈ చెట్టు.. గోదావరి వరద ప్రభావంతో తాజాగా నేలకు ఒరిగింది. దీంతో ఈ చెట్టులో అనుబంధమున్న సినిమావారు, ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చివరిగా ఈ సినిమా చెట్టు దగ్గర రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) షూటింగ్ జరిగింది. గతంలో రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' మూవీ ఇక్కడ షూటింగ్ జరుపుకోగా బ్లాక్ బస్టర్ అయింది.
![]() |
![]() |