![]() |
![]() |

'మనం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'థ్యాంక్యూ'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
'థ్యాంక్యూ' మూవీ ఫస్ట్ లుక్ గురించి అప్డేట్ ఇస్తూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా రేపు(నవంబర్ 23న) సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఫస్ట్ లుక్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఫారెన్ లో ఉన్న హీరో విజయోత్సాహంతో చేతులు ఎత్తినట్లుగా పోస్టర్ లో కనిపిస్తుంది. ఇక ఫస్ట్ లుక్ తో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.

'థ్యాంక్యూ' మూవీలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అవికా గోర్, మాళవిక నైర్ కూడా ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |