Home

»

Latest News

మారుతి.. స‌రిగ్గా ప‌దేళ్ళ త‌రువాత‌!

Nov 22, 2021 3:04PM

తెలుగునాట వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ద‌ర్శ‌కుల్లో మారుతి ఒక‌రు. `ఈ రోజుల్లో`, `బ‌స్ స్టాప్`, `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్`, `కొత్త జంట‌`, `భ‌లే భ‌లే మ‌గాడివోయ్`, `మ‌హానుభావుడు`, `ప్ర‌తి రోజూ పండ‌గే`.. ఇలా మారుతి రూపొందించిన సినిమాల్లో సింహభాగం విజ‌యం సాధించాయి. రీసెంట్ గా రిలీజైన `మంచి రోజులు వ‌చ్చాయి` కూడా మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా.. చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ళ‌ను ఆర్జించింది.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ కాంబినేష‌న్ లో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` చిత్రం చేస్తున్నారు మారుతి. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 18న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. మారుతి తొలి చిత్రం `ఈ రోజుల్లో` 2012లో ఇదే మార్చి నెల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే.. స‌రిగ్గా ప‌దేళ్ళ త‌రువాత మ‌ళ్ళీ అదే మార్చి నెల‌లో వ‌స్తున్న మారుతి డైరెక్టోరియ‌ల్ `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`నే కావ‌డం విశేషం. మ‌రి.. త‌న‌కి ద‌ర్శ‌కుడిగా జ‌న్మ‌నివ్వ‌డ‌మే కాకుండా విజ‌యాన్ని కూడా అందించిన మార్చి నెల‌లో.. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` రూపంలో మారుతి మ‌రో స‌క్సెస్ ని న‌మోదు చేసుకుంటాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com