Home  »  News  »  Nag ashwin: కల్కి 2 షూటింగ్ అప్‌డేట్.. నాగ్ అశ్విన్ సంచలన ప్రకటన

Updated : Jun 6, 2026

 

కల్కి పార్ట్ 2(Kalki Part 2).. ఇండియన్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ హోదాతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా ప్రభాస్ కూడా కొన్ని రోజులు షూట్ లో పాల్గొన్నాడనే వార్తలు వచ్చాయి. అశ్విన్  నిర్మాతగా, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన'సింగ్ గీతం'. ఈ నెల 11 వ తేదీన రిలీజ్ అవుతుంది.

ఈ మూవీ ప్రమోషన్స్ లో అశ్విన్ 'కల్కి 2' గురించి మాట్లాడుతు జూలై నుంచి 'కల్కి 2'  నాన్ స్టాప్ గా షూటింగ్ ని జరుపుకోనుంది చెప్పాడు. ఇప్పుడు ఈ మాట ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కల్కి లవర్స్ లో జోష్ తెచ్చినట్లయింది. ఇప్పటికే దాదాపు 20 నుండి 25 రోజుల షూటింగ్‌ని మొదటి భాగంతో పాటే పూర్తి చేసినట్లు నాగ్ అశ్విన్ గతంలోనే హింట్ ఇచ్చారు. మిగిలిన ప్రధాన భాగం అంతా వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోయే లాంగ్ అండ్ కంటిన్యూస్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ లో ఇండియన్ సినిమా లెజెండ్స్ అమితాబ్ బచ్చన్,  కమల్ హాసన్ మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ ఫేస్-ఆఫ్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని ఆయన నమ్మకంగా చెప్పారు. అంతేకాకుండా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ వసూళ్ల రికార్డులను దృష్టిలో పెట్టుకుని, పార్ట్ 2 ని మరింత విజువల్ వండర్ గా, సరికొత్త 4వ ప్రపంచాన్ని (4th World) పరిచయం చేస్తూ నిర్మించబోతున్నట్లు సమాచారం.


Also read: భయపడితే మాకు సంబంధం లేదు.. ఓటిటిలో దుమ్ము రేపుతున్న హర్రర్ క్రైమ్ థ్రిల్లర్

మరోవైపు జూన్ 11న రిలీజ్ కాబోతున్న 'సింగ్ గీతం' సినిమా వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన చారిత్రక నేపథ్యాన్ని కూడా నాగ్ అశ్విన్ ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారికి నా  మనసులో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనపై ఉన్న గౌరవంతోనే 'జాతి రత్నాలు' సినిమా తర్వాత తాను ఈ చిత్రాన్ని నిర్మించాను. నిజానికి ఈ కథని  సింగీతం శ్రీనివాసరావు తన క్లాసిక్ మూవీ 'పుష్పక విమానం' కంటే ముందే రాసుకున్నారు. అప్పట్లో ఈ వినూత్నమైన మ్యూజికల్ కథని   కమల్ హాసన్ గారికి  కూడా వినిపించారని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకి సింగీతం కలల ప్రాజెక్టుని మేము  నిర్మించడం చాలా ఆనందంగా  ఉందని చెప్పుకొచ్చాడు.



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.