![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)ఎవరి ఊహలకి అందని విధంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ జి 250 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ ని రాబట్టిందని చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
రీసెంట్ గా ఓజి స్పెషల్ స్క్రీనింగ్ హైదరాబాద్(Hyderabad)లోని ప్రసాద్ ల్యాబ్(Prasad labs)లో ప్రదర్శించడం జరిగింది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ ని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan),పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వీక్షించడం జరిగింది. దర్శకుడు సుజీత్(Sujeeth)థమన్,నిర్మాత దానయ్య ,సినిమాటోగ్రాఫర్ రవికేచంద్రన్ సహా ఇతర ముఖ్యులు కూడా ఈ షో లో పాల్గొన్నారు. మూవీ చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రత్యక్షమవడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
'ఓజి' ఇప్పటికే 250 కోట్లని రాబట్టడంతో క్లోజింగ్ కలెక్షన్స్ ఏ మేర వస్తాయనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో ఉంది. విజయదశమి ఫెస్టివల్ ఉండటం కూడా కలిసి వచ్చే అవకాశం. ఇటీవల ఓజి ని పైరసీ చేస్తున్న ముఠాని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,నానితో పాటు పలువురు సినీనటులు హైదరాబాద్ పోలీసులతో భేటీ అయ్యి ధన్యవాదాలు తెలిపారు.

![]() |
![]() |