![]() |
![]() |

ఈ జనరేషన్ టాలెంటెడ్ యాక్టర్స్ లో మంచు మనోజ్ (Manchu Manoj) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మనోజ్.. ఏవో వ్యక్తిగత కారణాల వల్ల 2017 లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత దాదాపు ఎనిమిదేళ్లు నటనకు దూరమయ్యాడు. దీంతో మనోజ్ కమ్ బ్యాక్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ ఏడాది 'భైరవం'తో రీ-ఎంట్రీ ఇచ్చాడు మనోజ్. అయితే ఆయన కమ్ బ్యాక్ రేంజ్ కి తగ్గ సౌండ్ ఆ సినిమా చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసేలా 'మిరాయ్' వచ్చింది. (Mirai Movie)
తేజ్జ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మూవీ 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ లో మంచు మనోజ్ విలన్ గా నటించడం విశేషం. మంచి అంచనాలతో తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన 'మిరాయ్'కి పాజిటివ్ టాక్ లభించింది. అయితే 'మిరాయ్' చూసిన ప్రతి ఒక్కరూ.. సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారో, మంచు మనోజ్ గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. మనోజ్ స్క్రీన్ ప్రజెన్స్ కి, యాక్టింగ్ కి, డైలాగ్ డెలివరీకి అందరూ ఫిదా అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మనోజ్ నటవిశ్వరూపం చూపించాడని అంటున్నారు. 'మిరాయ్'లోని తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో.. మనోజ్ కి పాన్ ఇండియా ఆఫర్స్ క్యూ కట్టే అవకాశముంది. ఒక్క తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల స్టార్స్ నటించే పాన్ ఇండియా సినిమాల్లోనూ పవర్ ఫుల్ రోల్స్ కి మనోజ్ మంచి ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |