![]() |
![]() |
.webp)
ప్రముఖ హీరో మంచు మనోజ్(Manoj)గత కొన్ని రోజుల నుంచి తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu)యూనివర్సిటీ లో చదివే విద్యార్థులు,అక్కడే నివసించే సామాన్య ప్రజానీకం,వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మంచి కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా కూడా ఒక వ్యాపారస్థుడికి బౌన్సర్ల వాళ్ళ అన్యాయంగా జరగగా మంచు విష్ణు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.రీసెంట్ గా మనోజ్ తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పైగా ఆ విషయంపై భిన్నమైన కథనాలు కూడా వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మనోజ్ రీసెంట్ గా ఒక వీడియో విడుదల చెయ్యడం జరిగింది
ఆ వీడియోలో మనోజ్ మాట్లాడుతు కాలేజీ ఆపోజిట్ లో ఉంటున్న వాళ్ళ కోసం, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళ కోసం నేను మాట్లాడుతుంటే నన్ను డైవర్ట్ చేస్తు, ఎటాక్ చేస్తు నా కుటుంబ సభ్యుల్ని లాగుతు,ఒక మనిషిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు .నా మీద నా భార్య మీద 32 కేసులు పెట్టారు,అయినా సరే నేను భయపడను. నా దగ్గ్గర వాళ్ళు దౌర్జన్యం చేసిన వీడియోస్ ఉన్నాయి.అవన్నీ చంద్రగిరి సి ఐ కి ట్రాన్ఫర్ చెయ్యడం జరిగింది.నేను నా అప్ కమింగ్ ఫిలిం డైరెక్టర్, సిబ్బంది ఒక రిసార్ట్ లో ఉంటే సైరన్ వేసుకుంటూ పోలీసులు జీపుల్లో వచ్చారు.ఎస్ఐ నాతో సీఎం దగ్గర నుంచి వస్తున్నాని చెప్పి ముందుగా భయపెట్టించే ప్రయత్నం చేశారు.సీఎం గారి పేరు ఎందుకు చెప్తున్నారని పోలీసులను నిలదీశాను.దాంతో సిఎం బందోబస్తు దగ్గర నుంచి వస్తున్నామని మాట మార్చారు.ఆ తర్వాత నా కారులోనే స్టేషన్ కి వెళ్లాను.కానీ స్టేషన్ దాకా వచ్చిన ఎస్ ఐ లోపలకి రాకుండానే వెళ్ళిపోయాడు.దాంతో నేను లోపలకి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ తో సి సి కెమెరాల ముందే మాట్లాడాను.అంతే కానీ నేను ఎక్కడ పోలీసులని బెదిరించలేదు.రకరకాలుగా వార్తలు ప్రచిరించవద్దు.అన్ని సాక్ష్యాలతో నేనే ఈ రోజు ఎస్ పి దగ్గరకి వెళ్తానని చెప్పుకొచ్చాడు
![]() |
![]() |