![]() |
![]() |

సుమారు 600 గజల్స్ దాకా పాడి కొన్నింటిలో నటించి హిందీ చిత్ర సీమలో తన కంటు ఒక ప్రతేక్యమైన పేరు సంపాదించిన సింగర్ అండ్ నటి మల్లికా రాజ్ పుత్. ఏక్ ఇషారా, ఏ జమీన్, యారా తుజే మొదలైన పాటల ద్వారా ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న మల్లికా సాంగ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.అలాగే ఆమె పాడిన ఎన్నో పాటలు యు ట్యూబ్ లో నేటికీ నెంబర్ ఆఫ్ వ్యూయర్స్ తో ముందుకు దూసుకెళ్తున్నాయి.తాజాగా ఆమెకి సంబంధించిన ఒక వార్త భారతీయ సినీ ప్రేమికులని తీవ్ర విషాదంలో ముంచింది
ఉత్తర ప్రదేశ్ కి చెందిన మల్లికా సుల్తానాపూర్ లోని తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని చనిపోయింది. . ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే కారణాలు మాత్రం ఎవరకి తెలియదు.ఇంట్లో తన అమ్మ నాన్న ఉండగానే మల్లికా సూసైడ్ చేసుకోవడం ప్రతి ఒక్కరిని బాధకి గురి చేస్తుంది. ఆమె అమ్మ నాన్న అయితే మల్లికా మరణాన్ని తట్టుకోలేక పోతున్నారు.ఎంతో భవిష్యత్తు ఉన్న మల్లికా సూసైడ్ చేసుకొని చనిపోవడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆమె నటిగాను చాలా మంచి సినిమాల్లోనే చేసింది.కంగనా రనౌత్ తో కలిసి రివాల్వర్ రాణి అనే సినిమా ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చింది.పోలీసులు ఆమెది ఆత్మహత్యా లేక హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మల్లికా వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు.ఆమెకి 2020 లో ప్రదీప్ షిండే జనార్దన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
![]() |
![]() |