![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి స్టార్ డమ్ తీసుకువచ్చిన యాక్షన్ డ్రామా `ఛత్రపతి` (2005).. పదహారేళ్ళ తరువాత బాలీవుడ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, స్టార్ కెప్టెన్ వీవీ వినాయక్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనే హిందీనాట తొలి అడుగేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో నుస్రత్ బరుచా నాయికగా ఎంపికైందట. అంతేకాదు.. ఇప్పటికే రెండు రోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొందని సమాచారం. త్వరలోనే `ఛత్రపతి` రీమేక్ లో నుస్రత్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
`ప్యార్ కా పంచ్ నామా 2` (2015), `సోనూ కే టిటూ కీ స్వీటీ` (2018) చిత్రాలతో బాలీవుడ్ లో యాక్ట్రస్ గా మంచి గుర్తింపు పొందిన నుస్రత్.. తన కెరీర్ ఆరంభంలో శివాజీకి జోడీగా `తాజ్ మహల్` (2010) అనే తెలుగు సినిమా చేసింది. అందులో శ్రుతి అనే స్క్రీన్ నేమ్ తో ఈ టాలెంటెడ్ బ్యూటీ అలరించింది. ఆపై మళ్ళీ తెలుగు తెరపై కనిపించని ఈ అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో నటిస్తున్న బాలీవుడ్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండడం విశేషమనే చెప్పాలి. మరి.. నుస్రత్ కాంబినేషన్ బెల్లంకొండ బాబుకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |