![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటించిన `గ్యాంగ్ లీడర్`(2019) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది చెన్నై పొన్ను ప్రియాంక అరుళ్ మోహన్. అయితే, మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ కామెడీ థ్రిల్లర్.. ఆశించిన ఫలితాన్ని అందులేకపోయింది. అయినప్పటికీ `శ్రీకారం` రూపంలో మరో అవకాశం దక్కింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ ముంగిట కమర్షియల్ హిట్ అనిపించులేకపోయింది.
ఈ క్రమంలోనే.. కోలీవుడ్ బాట పట్టిన ప్రియాంక అక్కడ ఏకంగా మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిలో రెండు సినిమాలను శివ కార్తికేయన్ కాంబినేషన్ లోనూ.. ఓ చిత్రాన్ని సూర్యకి జోడీగానూ చేసింది. కాగా, ప్రియాంక కోలీవుడ్ డెబ్యూగా రూపొందిన `డాక్టర్` దసరా స్పెషల్ గా అక్టోబర్ 9న విడుదల కానుంది. తెలుగులోనూ `వరుణ్ డాక్టర్` పేరుతో అదే రోజున అనువాద రూపంలో రిలీజ్ కానుందీ శివ కార్తికేయన్ స్టారర్. మరి.. `గ్యాంగ్ లీడర్`, `శ్రీకారం` ఇలా స్ట్రయిట్ పిక్చర్స్ తో హిట్స్ అందుకోలేకపోయిన ప్రియాంకకి.. ఈ డబ్బింగ్ సినిమా అయినా ఆ లోటుని తీర్చుతుందేమో చూడాలి.
![]() |
![]() |