![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఫిల్మ్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ.. ఆగస్టు 7న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.
'కొరియన్ కనకరాజు'లో సత్య కామెడీ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ సీన్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి. దర్శకుడు మేర్లపాక గాంధీ.. లాజిక్స్ ని పక్కన పెట్టి, కామెడీతో మ్యాజిక్ చేశారు.
ఈ మూవీ మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 37.4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి బిజినెస్ రికవరీని దాటేసింది. అంతేకాకుండా ఓవర్సీస్‌లో ముఖ్యంగా USA బాక్సాఫీస్ దగ్గర హాఫ్ మిలియన్ డాలర్ ($500K) మార్కు వైపు శరవేగంగా దూసుకుపోతోంది.
దీనికి తోడు తెలంగాణలో బోనాలు సెలవుల అడ్వాంటేజ్ కూడా కలిసిరావడంతో.. సోమవారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ప్రాఫిట్ జోన్‌కి వెళ్లిన 'కొరియన్ కనకరాజు', లాంగ్ రన్‌లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Korean Kanakaraju, Box Office, Varun Tej, Merlapaka Gandhi
![]() |
![]() |