Home  »  News  »  ఒకే కారులో రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఏపి 40 LE 1 ల్యాండ్ క్రూయిజర్ ఎవరిదో తెలుసా?

Updated : Aug 10, 2026

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగు సినిమాకి  అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావడమే ఈ ఇద్దరి లక్యం. అందుకు తగ్గట్టే అప్ డేట్ సినిమాలని సెల్యులాయిడ్ పైకి తీసుకువస్తున్నారు. కంబైన్డ్ గా, విడివిడిగా భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఈ ఇద్దరికీ సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ వేర్వేరు సందర్భాల్లో ఒకే విలాసవంతమైన వైట్ కలర్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ సువ్‌లో ప్రయాణించడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  ఈ ఆసక్తికర కథనంలోకి వెళితే.. కొన్ని నెలల క్రితం అంటే 2026 జూన్ నెలలో మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) టోర్నీ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన విజయవాడ, మంగళగిరి పరిసరాల్లో 'AP 40 LE 1' రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన విలాసవంతమైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనంలోనే ప్రయాణించారు. చరణ్ రాకతో స్టేడియం ప్రాంగణమంతా అభిమానుల కోలాహలంతో మునిగిపోయింది. అప్పట్లో ఆ విలాసవంతమైన కారు నంబర్ ప్లేట్ దృశ్యాలు తెగ వైరల్ అయ్యాయి.  కట్ చేస్తే.. ఆదివారం రోజున వైజాగ్ నగరంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. విశాఖపట్నంలోని ప్రముఖ ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఏఏఏ' (AAA) మల్టీప్లెక్స్ సినిమా స్క్రీన్లను బన్నీ ఘనంగా ప్రారంభించారు. విమానాశ్రయం నుంచి ఇనార్బిట్ మాల్ వరకు వేలాది మంది అభిమానులు భారీ బైక్ ర్యాలీతో తమ అభిమాన నటుడికి ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం సరిగ్గా 1:00 గంట సమయంలో మాల్‌కు చేరుకున్న అల్లు అర్జున్, అక్కడ దాదాపు 2 గంటల పాటు గడిపారు. మల్టీప్లెక్స్‌లోని 'పుష్ప' ప్రత్యేక విగ్రహంతో పాటు తన సినీ ప్రస్థానానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని తిలకించారు. 

Also read: హీరోయిన్ కి లిప్ కిస్ పెట్టిన అభిమాని.. అతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు

అయితే విమానాశ్రయం నుంచి ఈ ఈవెంట్‌కు రావడానికి బన్నీ వాడిన కారు నంబర్ 'AP 40 LE 1' కావడం విశేషం.  చరణ్, బన్నీ ఇద్దరూ 'AP 40 LE 1' నంబర్ గల ఒకే ల్యాండ్ క్రూయిజర్‌లో ప్రయాణించడం చూసిన అభిమానులు ఆ కారు ఎవరిదై ఉంటుందా అని గూగుల్, సోషల్ మీడియా వేదికగా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో ఆ ల్యాండ్ క్రూయిజర్ కారు అసలు యజమాని ఎవరనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ల్యాండ్ క్రూయిజర్ వాహనం భీమిలి నియోజకవర్గ శాసనసభ్యుడు, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది అని తేలింది. గంటా శ్రీనివాసరావుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు మొత్తం మెగా కుటుంబంతో దశాబ్దాలుగా అత్యంత ఆత్మీయ, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  మెగా కుటుంబ సభ్యులు ఏపీకి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతానికి వచ్చిన ప్రతిసారీ వారికి కావలసిన ఆతిథ్య, పర్యటన ఏర్పాట్లను గంటా శ్రీనివాసరావు పర్యవేక్షిస్తుంటారు. అందులో భాగంగానే గత జూన్‌లో చరణ్ మంగళగిరి పర్యటనకు, ఇప్పుడు బన్నీ విశాఖ పర్యటనకు తన సొంత ల్యాండ్ క్రూయిజర్ 'AP 40 LE 1' వాహనాన్నే ఏర్పాటు చేశారు. దీంతో నెటిజన్లు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఈ కారులో దిగిన ఫొటోలను కొల్లాజ్‌గా చేసి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. "హీరోల మధ్య అనుబంధం ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది.. అనవసరమైన ఫ్యాన్ వార్స్ పక్కన పెట్టి కలసికట్టుగా ఉండాలి" అంటూ మెగా, అల్లు అభిమానులు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 'AP 40 LE 1' ల్యాండ్ క్రూయిజర్ వార్త టాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా నిలిచింది.

Ram Charan, Allu Arjun, Tollywood






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.