![]() |
![]() |

శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం 'కన్యక'. నకరికల్లు నరసరావుపేట చాగంటి వారిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రం యొక్క ఆడియో ఆగష్టు 15 న రిలీజ్ అయింది. ఈ చిత్రం ఇప్పుడు Bcineet OTT లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం 49 రూపాయలు రెంటల్ అమౌంట్ పే చేసి సినిమాను చూడొచ్చు అని నిర్మాతలు KV అమర్, సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్రరావు తెలిపారు.
ఆగష్టు 20 న రాఖీ పండుగ సందర్భంగా చిత్రం యొక్క ట్రైలర్ నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గారు రిలీజ్ చేసారని మరియు చిత్రం యొక్క వీడియో సాంగ్ ను ఏపీ బులియన్ మర్చంట్ అసోసిషన్ కపిలవాయి విజయ్ కుమార్ గారు, చిత్రంలోని రెండవపాట సుబ్బరాయ గుప్త గారు రిలీజ్ చేసారు అని, ఫస్ట్ మూవీ టికెట్ లాంచ్ కార్యక్రమం శ్రీశైలం ఆ భ్రమరాంబ మల్లిఖార్జుని స్వామి సన్నిధిలో వాసవి సత్రంలో వాసని సత్ర సముదాయాల అధ్యకులు శ్రీ దేవకి వెంకటేశ్వర్లు చేతుల మీదగా చీతీరాల పెద్దన్న గారు మరియు ఆర్య వైశ్య ప్రముఖల సమక్షంలో జరిగింది అని చిత్ర దర్శకుడు రాఘవ తెలిపారు. వినాయక చవితికి అన్ని ఓటీటీల్లో సినిమా రీలీజ్ చేస్తున్నామని చెప్పారు.

ఆడవారి పట్ల తప్పుగా బిహేవ్ చేస్తే ఎవరు క్షమించినా అమ్మవారు శిక్షిస్తుందని అనే పాయింట్ తో రూపొందిన ఈ సినిమాలో శివరామరాజు, జబర్దస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి , PVL వర ప్రసాదరావు, సర్కార్,ఫణిసూరి, RMP వెంకటశేషయ్య, సాలిగ్రామం మమత ,శిరీష , విజయ , రేవతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి అర్జున్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్స్ గా రాము, తరుణ్, ఎడిటర్ గా సుభాన్ వ్యవహరించారు.
![]() |
![]() |